సాక్షి, ముంబై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన మరోసారి ధ్వజమెత్తింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ’ఆచ్చేదిన్‘ హామీ ఎప్పుడు నిజం అవుతుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది. అంతేకాకా పెరగుతున్న డీజిల్‌చ, పెట్రోల్ ధరల పరిస్థితి ఏమిటని సూటిగా అడిగింది.
గతవారం మహరాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రకాంత్‌పాటిల్.. శివసేనను ఒక మూర్ఖపు పార్టీగా అభివర్ణించారు. దీనిపై సేన తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేసింది. ఉద్దవ్‌థాక్రే నేతృత్వంలోని శివసేన మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న ఇరు పార్టీలు.. కొంతకాలంగా కారాలుమిరియాలు నూరుతూనే ఉన్నాయి. తాజాగా చంద్రకాత్ పాటిల్ వ్యాఖ్యలపై సేన ఘాటుగా స్పందించింది.