బీజేపీ, శివసేన బాహాబాహీ
ముంబై: ముంబైలో బీజేపీ, శివసేన కార్యకర్తలు శనివారం బాహాబాహీకి దిగారు. ఇక్కడి ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు మెట్రో కారిడార్స్, ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత సభలో ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ, శివసేన కార్యకర్తలు పరస్పరం పార్టీ జెండాలు చూపుకుంటూ బాహాబాహీకి దిగారు. కార్యకర్తల నినాదాలు, తోపులాటలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అరేబియా సముద్రంలోని ద్వీపంలో 192 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఛత్రపతి శివాజీ స్మారకానికి మోదీ ఇవాళ శంకుస్థాపన చేశారు. కాగా.. శివాజీ విగ్రహ నిర్మాణం క్రెడిట్‌ను పొందడానికి బీజీపీ ప్రయత్నిస్తుందని శివసేన ఆరోపించిన విషయం తెలిసిందే.