
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ అన్యాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించడం లేదని, టీఆర్‌ఎస్, బీజేపీలు తొడుదొంగల్లా పనిచేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలోని హామీలు అమలు కాకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేసీఆర్ గతంలో పాల్పడిన అవినీతి పనులతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని పొన్నం ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటున్నా, వాస్తవంగా రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. ప్రధాని మోదీ అనాలోచితంగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధిని కోల్పోయారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment