సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల జల్లు కురిపంచారు. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని ఈసీని కొనియాడారు. విపక్షాలు ఎన్నికల సంఘాన్ని విమర్శించవద్దని ప్రణబ్ హితవుపలికారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు ఎన్నికల నిర్వహణ సంస్థలని, అవన్నీబాగా పనిచేస్తున్నాయని ప్రశంశించారు.
కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌తో పలు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీపై విమర్శలు చేస్తున్న నాయకులకు ఆయన చురకలంటించారు. చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో గొడవ పడతాడని, మంచి కార్మికుడు పనిముట్లను సజావుగా ఉపయోగిస్తాడని చలోక్తులు విసిరారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ఆపార్టీలో చర్చనీయాంశంగా మారాయి. దిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమావేశంలో ప్రణబ్ మాట్లాడుతూ.. ‘‘ సుదీర్ఘ కాలంలో రాజ్యాంగ సంస్థలు నిర్మించబడ్డాయి. తొలి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ నుంచి నేటి వరకు ఎన్నికల సంఘం అద్భుతంగా ఎన్నికలను నిర్వహిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 67% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశంలో 2/3 ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా ఓటు వేశాను. ఎన్నికల కమిషనర్లు అందరిని ప్రభుత్వాలే నియమిస్తూ వచ్చాయి.’’అని ప్రణబ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment