సాక్షి, నాగ్‌పూర్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం నాగ్‌పూర్‌కు విచ్చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. నాగ్‌పూర్ విమానాశ్రయంలో ప్రణబ్‌కు ఆరెస్సెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందించి.. కార్యకర్తల కవాతుతో ఆయనకు స్వాగతం తెలిపారు.
ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడిగా జీవితమంతా బీజేపీని, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ను తీవ్రంగా విమర్శించిన ప్రణబ్ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రణబ్ సహచరులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు, వామపక్ష నేతలు ఆయన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాను ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నా వెనుకకు తగ్గని ప్రణబ్ ముఖర్జీ.. ఈ విషయంలో తాను ఏం చెప్పదల్చుకున్నది.. నాగ్‌పూర్‌లోనే చెప్తానని విమర్శకులకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment