మాటలు మరచినా.. దృశ్యాలు ఉంటాయి | Pranab Mukherjee daughter disapproves of decision to attend RSS | Sakshi
Sakshi News home page

మాటలు మరచినా.. దృశ్యాలు ఉంటాయి

Published Thu, Jun 7 2018 5:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

Pranab Mukherjee daughter disapproves of decision to attend RSS  - Sakshi

న్యూఢిల్లీ: ఆరెస్సెస్‌ కార్యక్రమంలో ప్రసంగించబోతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నిర్ణయాన్ని ఆయన కూతురు శర్మిష్ట ముఖర్జీ వ్యతిరేకించారు.  ‘ప్రణబ్‌ మాటల్ని మరచిపోయినా.. ఆ దృశ్యాలు అలాగే మిగిలిపోతాయి’ అని ఆమె వ్యాఖ్యానించారు. నాగపూర్‌కు వెళ్లడం ద్వారా తన తండ్రి బీజేపీ నేతలకు కట్టుకథలు అల్లే అవకాశమిస్తున్నారని అన్నారు. బీజేపీ కుటిల రాజకీయాలను ఆయన అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ప్రణబ్‌ ఆరెస్సెస్‌ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఒకరోజు ముందు..శర్మిష్ట బీజేపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు వ్యాపించాయి. వాటిని ఆమె కొట్టిపారేస్తూ పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్‌ను వీడాల్సి వస్తే అంతకుముందే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. ‘మీ ప్రసంగంలో ఆరెస్సెస్‌ సిద్ధాంతాలకు మద్దతు పలుకుతారని వాళ్లకు కూడా నమ్మకం లేదు. మీ మాటల్ని మరిచిపోయినా ఆ దృశ్యాలకు బూటకపు వ్యాఖ్యలు జోడించి ప్రచారం చేస్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement