హైదరాబాద్: బీజేపీ జనగామ నియోజక వర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనగామ ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకే తానీ నిర్ణయం తీసుకున్నా నని ఆయన ప్రకటించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన రాజీ నామా పత్రాన్ని ప్రదర్శించారు.
పార్టీలో క్రమశిక్షణ లోపించడం వల్ల బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కొమ్మూరి తెలి పారు. అన్ని మండలాల ముఖ్య నాయ కులూ తన బాటలోనే నడవనున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరుతారని విలేక రులు అడిగిన ప్రశ్నకు.. ప్రజల అభీష్టం మేరకే నడుచుకుంటానని బదులిచ్చారు. మంత్రి హరీశ్‌ను కేవలం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని, రాజకీయ చర్చ జరగలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment