
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభ ల్లో 50% రిజర్వే షన్లు కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీలకు మద్దతుగా ఈ బిల్లును పార్లమెంట్‌లో పెట్టడం హర్షించదగిన విషయమన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. 70 ఏళ్లుగా బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేశారన్నారు.
బీసీ బిల్లుపై పలు మార్లు ప్రధాని, కేంద్ర మంత్రులను కలసినా నిరాశే మిగిలిందన్నారు. రిజర్వేషన్ల అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి ల విడుదలపై మంగళవారం జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామ న్నారు. ఈ నెల 7న కరీంనగర్‌లో, 9న పరిగి, 21న తిరుపతి, 25న విజయవాడ, 29న కర్ణాటకలోని బీదర్‌లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు.