
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు 65 టికెట్లను కేటాయించాల ని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ సంఘం, 36 సంచార జాతుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవ న్‌లో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడు తూ.. బీసీలను నిర్లక్ష్యం చేసినా, తక్కువ టికెట్లు కేటాయించినా ఆ పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడిస్తామన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ 105 టికెట్లు ప్రకటిస్తే, బీసీలకు 20 టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకుం దని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రకటించబో యే టికెట్లలో బీసీ నాయకుల పేర్లు లేవనే వార్త లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, 36 కులాల సంచార జాతుల సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment