
సాక్షి, వైఎస్సార్: జిల్లాలోని ప్రొద్దుటూరులో మంగళవారం జరిగిన ధర్మపోరాటం సభకు ఆరు జిల్లాల నుంచి ప్రజలను తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్న ధర్మపోరాట సభకు భారీగా జన సమీకరణ చేయడానికి.. టీడీపీ నాయకులు డబ్బు, మద్యం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్టు తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు.
నాలుగున్నర ఏళ్లలో సాధించలేని ఉక్కు పరిశ్రమ నెలలో సాధిస్తామని అనడం హాస్యాస్పందంగా ఉందన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ఒక బుడబుడకలోడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి ఒక రాజకీయ వేశ్య అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment