
కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు తన బాస్ అని సోనియా గాంధీ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవ ప్రక్రియలో ఉందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం మైనారిటీలపై హింసను బీజేపీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కొద్దినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలోనూ బీజేపీ ఇలాగే వ్యవహరిస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో సోనియా మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీతో కలిసి పార్టీ ఎంపీలంతా అంకితభావం, విశ్వాసంతో పనిచేయాలని పిలుపు ఇచ్చారు. ఇక తనకూ ఇప్పుడు రాహులే బాస్ అని స్పష్టం చేశారు.
తనకు సహకరించిన విధంగా రాహుల్‌కూ సహకారం అందించాలని ఎంపీలకు సూచించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ పునరుజ్జీవ ప్రక్రియ సాగుతుందని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment