సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకలను గోవాలో ఘనంగా జరుపుకున్నారు. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నూతన సంవత్సర వేడుకలను తల్లితో కలిసి జరుపుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత సోనియా కొన్ని రోజులుగా గోవాలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
శనివారం గోవా వెళ్లిన రాహుల్ అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తన తల్లితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. అయితే అది పూర్తిగా వ్యక్తిగతమైన పార్టీ కావడంతో ఎవరిని ఆహ్వనించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హడావిడి లేకుండా ఉండేందుకే రాహుల్, సోనియాలు గోవాలో వేడుకలు జరుపుకున్నట్టు తెలుస్తోంది. గత డిసెంబర్ 27న సోనియా గోవా బీచ్‌లో సైకిల్ రైడింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన కూడా.
ఇటీవల జరిగిన హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ రెండు నెలల పాటు అన్నీ తానై ప్రచారం చేశారు. అంతేకాకుండా బీజేపీకి కంచుకోట అయిన గుజరాత్‌లో ఆ పార్టీకి రాహుల్ గట్టి పోటీనే ఇచ్చారు. అలాగే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా రాహుల్ పావులు కదుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment