
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ టార్గెట్ చేశారు. పీఎన్‌బీ స్కామ్ వెలుగుచూసే నెలరోజుల ముందుగా న్యాయవాది అయిన జైట్లీ కుమార్తెకు నిందితుడు నీరవ్ మోదీ భారీ మొత్తం చెల్లించినందునే ఆర్థిక మంత్రి మౌనం దాల్చారని రాహుల్ ఆరోపించారు. నిందితుడికి న్యాయసహాయం అందించే ఇతర లా సంస్థలపై సీబీఐ దాడులు చేపట్టినా జైట్లీ కుమార్తెపై ఎలాంటి చర్యలూ లేకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
పీఎన్‌బీ స్కామ్‌పై రాహుల్ మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. నకిలీ పత్రాలతో పీఎన్‌బీ నుంచి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ రూ 12,000 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిన క్రమంలో సీబీఐ, ఈడీలు దర్యాప్తు సాగిస్తున్నాయి. ఈ కేసులో నీరవ్ బంధువు, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీ కూడా నిందితుడిగా ఉన్నారు. కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచీ వీరు దేశం విడిచివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment