కేటీఆర్‌ నేను గుర్తులేకపోయినా.. | Revanth reddy respond on minister ktr comments | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ నేను గుర్తులేకపోయినా.. వాళ్లను గుర్తుంచుకో..

Published Fri, Dec 29 2017 6:29 PM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Revanth reddy respond on minister ktr comments - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం రేవంత్‌ రెడ్డి ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘రేవంత్‌ రెడ్డి ఎవరని కేటీఆర్‌ అడుగుతున్నారు. నేను గుర్తు లేకపోయినా కనీసం...శ్రీకాంతాచారి, కోదండరాంను గుర్తుంచుకో. ఇక డాక్టర్‌ కోర్స్‌ను మంత్రి లక్ష్మారెడ్డి ఎక్కడ చదివారో చెప్పాలి. ఇద్దరి సత్తాను జడ్చర్లలో తేల్చుకుందాం.’ అని సవాల్‌ విసిరారు.

కాగా మంత్రి కేటీఆర్‌ నిన్న (గురువారం) ట్వీట్టర్‌లో నెటిజన్లతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాలు, వ్యక్తిగత అభిరుచులు, పవన్‌ కల్యాణ్‌, రేవత్‌ రెడ్డి.. ఇలా చాలా అంశాలపై నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ రేవంత్‌ రెడ్డి ప్రస్తావన తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి గురించి రెండు మాటల్లో చెప్పండంటూ ట్విట్‌ చేయగా...హూ ఈజ్ దట్ అంటూ కేటీఆర్‌ రిప్లయ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement