ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం | Sambangi Venkata China Appala Naidu Sworn In AS Pro-tem Speaker | Sakshi
Sakshi News home page

ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం

Published Sat, Jun 8 2019 11:21 AM | Last Updated on Sat, Jun 8 2019 11:23 AM

Sambangi Venkata China Appala Naidu Sworn In AS Pro-tem Speaker - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 

కాగా శంబంగి బొబ్బిలి శాసనసభా నియోజకవర్గం నుంచి ఇప్పటికి 4సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావును ఓడించారు. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైతే శంబంగి శాసనసభ సమావేశాల తొలి రోజున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ స్పీకర్‌ ఎన్నికను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించిన తరువాత ఆయన పదవీకాలం ముగుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement