షియోపూర్ (మధ్యప్రదేశ్): కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి బిడ్డలను కాపాడుకోవాలన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ‘బీజేపీ కే మంత్రి ఔర్ ఎమ్మెల్యే సే బేటీ బచావో (బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అమ్మాయిలను కాపాడండి)’ అనే దానిలా మార్చాలని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment