
సాక్షి, అమరావతి: టీడీపీలో టికెట్ల పంచాయతీ తెలడం లేదు. చాలా చోట్ల సిట్టింగ్‌లకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగడం టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. గత పదిహేను రోజులుగా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నప్పటికీ.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో చాలా వరకు ఆ సమావేశాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. సీట్ల కోసం నేతల మధ్య వివాదాలు పరిష్కరించడాని చంద్రబాబు సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే నేతల మధ్య సయోధ్య కుదర్చడంలో సమన్వయ కమిటీ విఫలమైనట్టుగా తెలుస్తోంది.
కొవ్వురులో మంత్రి జవహర్, నిడదవోలులో శేషారావుపై స్థానిక నేతల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. మరోవైపు పాయకరావుపేట, పాతపట్నంలలో సిట్టింగ్‌లుగా ఉన్న అనిత, కలమట వెంకటరమణకు సీటు ఇవ్వవద్దని అసంతృప్త నేతలు పార్టీ అధిష్టానానికి తెలిపాయి. అవనిగడ్డలో మండలి బుద్దప్రసాద్‌ను, మంగళగిరిలో సునీల్‌ను నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గుడివాడ, చీపురుపల్లి, మంగళగిరిలో స్థానిక నేతలకే సీట్లు ఇవ్వాలని అక్కడి నేతలు పట్టుబడుతున్నారు. సొంత పార్టీ నేతల మధ్య పోరు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment