
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోసం శివసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. శివసేనకు సహకరించేందుకు ఎన్సీపీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు శివసేనకు పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలను 17 మంది సేన ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రగులుతున్న ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకోనున్నారు. ఇక బీజేపీ సైతం సేన ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడంతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను సమీకరించి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదపడంతో మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ పెంచుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment