పశ్చిమ ప్రకాశానికి తీవ్ర అన్యాయం | TDP Government Is Fail YV Subba Reddy | Sakshi
Sakshi News home page

పశ్చిమ ప్రకాశానికి తీవ్ర అన్యాయం

Published Thu, Aug 23 2018 9:28 AM | Last Updated on Thu, Aug 23 2018 9:28 AM

TDP Government Is Fail YV Subba Reddy - Sakshi

మార్కాపురం బహిరంగ సభలో జనవాహినిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

మార్కాపురం (ప్రకాశం): నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో పశ్చిమ ప్రకాశానికి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఒంగోలు పార్లమెంట్‌ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నిప్పులు చెరిగారు. వెలిగొండ ప్రాజెక్టు సత్వరం పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజాపాదయాత్ర పాఠశాలలకు పంపించిన తల్లిదండ్రులను ప్రశ్నార్ధకంలో పడేసింది. పాఠశాలలు తెరిచి 8వ రోజు బుధవారం మార్కాపురం నియోజకవర్గంలో 14 కి.మీ మేర సాగింది. అందులో భాగంగా పాతబస్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే శాశ్వతంగా కరువు నివారించే రూ.3,500 కోట్లు కేటాయించి గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల గ్యాప్‌లు పూర్తి చేసి టన్నెల్‌ పన్నులు ప్రారంభించారన్నారు.

దురదృష్టవశాత్తూ ఆయన మృతి చెందిన తరువాత ప్రాజెక్టు పనులు మందగించాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వెలిగొండ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటినా కేవలం 1.5 కి.మీ మాత్రమే టన్నెల్‌ పనులు చేశారన్నారు. రాబోయే సంక్రాంతి నాటికి వెలిగొండ నీళ్లిస్తామని పశ్చిమ ప్రకాశం ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారన్నారు.  ఫ్లోరైడ్‌ నీరు తాగుతూ కిడ్నీ వ్యాధులకు గురై వందలాది మంది ప్రజలు చనిపోతున్నారన్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పి జగనన్నను సీఎం చేసేందుకు ప్రజలు ఆశీర్వదించాలని, అప్పుడు ఏడాదిలో ప్రత్యేక హోదాతో పాటు వెలిగొండను పూర్తి చేసి నీరు ఇస్తామని ప్రజల హర్షధ్వానాల మధ్య వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  వైఎస్సార్‌ మంజూరు చేసిన షాదీఖానా నిర్మాణాన్ని టీడీపీ ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. వైఎస్సార్‌ నాడు దూపాడు పథకానికి నిధులు కేటాయించినందునే ఈరోజున మార్కాపురం ప్రజలు సాగర్‌ నీటిని తాగుతున్నారని, అయితే 4 రోజులకు ఒకసారి నీరు ఇవ్వటం బాధాకరమన్నారు.

నాడు హోదా మాట్లాడితే కేసులన్నారు.. మీపై ఏ సెక్షన్లు పెట్టాలి:
నాడు ప్రత్యేక హోదా గురించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు, ప్రజలకు వివరించేందుకు యువభేరి, యువగర్జనలు పెడితే ఆ సభలకు హాజరైన వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామన్న చంద్రబాబు ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్నారని, ఆయనపై ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని మండలి ప్రతిపక్షనేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ప్రస్తుతం చంద్రబాబుకు దిక్కుతోచక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు దిక్కులు చూస్తూ పరువు పోగొట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.   ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ హోదా కోసం రాజీనామా చేసి వెలిగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తూ వైవీ సుబ్బారెడ్డి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు.

వచ్చే ఎన్నికల్లో  ప్రకాశం  అన్ని  అసెంబ్లీ సీట్లను వైఎస్సార్‌ సీపీ గెలుచుకుని వెలిగొండను పూర్తిచేసుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రం నుంచి నియోజకవర్గం వరకు కమీషన్లు, దందాలు, భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వెన్నా హనుమారెడ్డి, మీర్జా షంషీర్‌ అలీబేగ్‌లు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ముఖ్యమంత్రి మాయమాటలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి కె.మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే గరటయ్య,  వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు కుందురు నాగార్జునరెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కేవీ రమణారెడ్డి, ఆనందరావు, మందటి మహేశ్వరరెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, కంది ప్రమీలారెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, గుంటక సుబ్బారెడ్డి, నియోజకవర్గంలోని వైఎస్సార్‌ సీపీ కన్వీనర్లు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, నల్లబోతుల కొండయ్య, జాన్‌రత్నం, రాచమల్లు వెంకట రామిరెడ్డి, సంజీవరెడ్డి, ఎంపీపీలు మాలకొండయ్య, ఉడుముల రామనారాయణరెడ్డి, నరసింహారావు, జెడ్పీటీసీలు రంగారెడ్డి, బాషాపతిరెడ్డి, మెట్టు వెంకటరెడ్డి, సాయి రాజేశ్వరరావు, కేకే మిట్ల మాజీ సర్పంచ్‌ అంజిరెడ్డి, పార్టీ కౌన్సిలర్లు డాక్టర్‌ చెప్పల్లి కనకదుర్గ, షేక్‌ ఇస్మాయిల్, ముర్తుజావలి, చిర్లంచర్ల లీలావతి, గొలమారి శివారెడ్డి,  బూదాల విజయలక్ష్మి, షేక్‌ గౌసియా, దొడ్డా పార్వతి, నాగలక్ష్మి, ఆవులమంద పద్మ, బద్దిగం నారాయణరెడ్డి, నాగరాజప్పగౌడ్, టీవీ కాశయ్య, మౌలాలి, వరప్రసాద్, సుధీర్, బొగ్గరపు శేషయ్య, వీరారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీని గజమాలతో, శాలువాలతో పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
 
పాదయాత్ర సాగింది ఇలా... 
వెలిగొండ ప్రాజెక్టు కోసం మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజాపాదయాత్ర 8వ రోజు ఉదయం 9గంటలకు మార్కాపురం మండలం తిప్పాయపాలెం నుంచి ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు మోహన్‌రావు, విశ్వరూప్, మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, బాచిన చెంచు గరటయ్య, అన్నా రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, పార్టీ నాయకుడు వెన్నా హనుమారెడ్డి వెంట రాగా, పాదయాత్రకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై పూలుచల్లి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. చింతగుంట్ల, కుంట వరకు పాదయాత్ర సాగి భోజన విరామం అనంతరం వేములకోట, జంకె రామిరెడ్డి కాలనీ మీదుగా మార్కాపురం పట్టణంలో బహిరంగ సభ అనంతరం ఎస్టేట్‌ వరకు సాగింది. మొత్తం 14 కిలోమీటర్లు వైవీ సుబ్బారెడ్డి నడిచారు.
 
అడుగడుగునా నీరాజనం: 
మహిళలు పూలు చల్లుతూ, బొట్లు పెడుతూ, హారతులు ఇస్తూ వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. జంకె వెంకటరెడ్డి స్వగ్రామమైన వేములకోట, జంకె రామిరెడ్డి కాలనీ ప్రాంతాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పాదయాత్ర వెంట నడిచారు. తీన్‌మార్‌ డప్పులతో హోరెత్తించారు. ఎంపీటీసీ వెంకట నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ జంకె చెన్నారెడ్డి, చాగంటి సుబ్బారెడ్డి, తదితరులు మాజీ ఎంపీకి ఘనస్వాగతం పలికారు. టపాసులతో హోరెత్తించారు. మాజీ ఎంపీ రాక సందర్భంగా తిప్పాయపాలెం నుంచి మార్కాపురం మీదుగా ఎస్టేట్‌ వరకు సుమారు 14 కి.మీ మేర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు. వైవీ పర్యటనతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. పార్టీ ఎస్సీ విభాగం నాయకులు రాజేష్, ఉత్తమ్, బీసీ, మైనార్టీ విభాగాల నాయకులు పాల్గొన్నారు.

నేటి పాదయాత్ర ఇలా... 
9వ రోజున అయిన గురువారం ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ఎస్టేట్‌ నుంచి ప్రారంభమై మార్కాపురం మండలం రాయవరం, తర్లుపాడు మండలం గానుగపెంట వరకు సాగి భోజన విరామం అనంతరం గజ్జలకొండ వరకు జరుగుతుంది. మొత్తం 14.8 కి.మీ పాదయాత్ర సాగుతుందని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

మహిళా కూలీలతో కలిసి నడుస్తున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

2
2/3

వైవీకి సంఘీభావం తెలుపుతున్న అన్నా రాంబాబు

3
3/3

పాదయాత్రలో వైవీ వెంట నడుస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జంకె, వెన్నా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement