![TTD Chairman YV Subba Reddy Talks In Press Meet At Tirupati - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/27/YV-SUBBA-REDDY.jpg.webp?itok=6yFdhyHV)
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆస్తులతో ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడటం దారుణమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ ఆస్తులు విక్రయించాలని చూసింది తెలుగుదేశం పాలనలోని టీటీడీ పాలక మండలి కాదా అన్నారు. అప్పుడు తప్పు చేసి ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు పాటుపడుతున్నారని చెప్పారు. అయినా ప్రతిపక్షాలు రాజకీయం చేయడం దారుణమన్నారు. (పథకం ప్రకారం దుష్ప్రచారం)
కాగా రేపు(గురువారం) జరగనున్న పాలక మండలి సమావేశాన్ని వీడియో కన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వామి వారి దర్శనం కోసం అన్ని ఎర్పాట్లు చేపడుతున్నాయమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు చెబితే అప్పుడు భక్తలకు దర్శనం అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. స్వామి వారి ప్రసాదాలకు విపరీతమైన డిమాండ్ ఉందని, చాలా ప్రాంతాల వాసులు శ్రీవారి ప్రసాదాలు అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. పరిస్థితిని బట్టి ప్రసాదాలు అందిస్తామని, ప్రస్తుతం తిరుమలలో ఇంజనీరింగ్ పనులు జరుగుతున్నాయని చైర్మన్ పేర్కొన్నారు. (రేపు టీటీడీ పాలకమండలి సమావేశం)
Comments
Please login to add a commentAdd a comment