టీఆర్‌ఎస్‌లోకి కంచర్ల భూపాల్‌ రెడ్డి | TDP leader Kancharla Bhupal Reddy joins TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన కంచర్ల భూపాల్‌ రెడ్డి

Published Mon, Nov 6 2017 8:10 PM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM

TDP leader Kancharla Bhupal Reddy  joins TRS  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్‌ తగిలింది. నల్గొండ జిల్లా టీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్‌లో చేరారు.  హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఆయన.. 17మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్‌ వెంటే ఉంటారన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ వాపును చూసి బలుపు అనుకుంటోందని వ్యాఖ్యానించారు.

1960 నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేని విమర్శించారు. 2004లో టీఆర్‌ఎస్‌ పుణ్యాన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2009-14 వరకూ ప్రజలంతా ఏకం కావడంతో గతిలేకే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ సచ్చిందని, కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయిందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సేనని, ఆ పార్టీ నేతల మాయమాటలు ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement