bhupalreddy
-
టీఆర్ఎస్లోకి కంచర్ల భూపాల్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నల్గొండ జిల్లా టీడీపీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి సోమవారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన.. 17మంది ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపు అనుకుంటోందని వ్యాఖ్యానించారు. 1960 నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయేని విమర్శించారు. 2004లో టీఆర్ఎస్ పుణ్యాన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. 2009-14 వరకూ ప్రజలంతా ఏకం కావడంతో గతిలేకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణలో టీడీపీ సచ్చిందని, కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు శత్రువు కాంగ్రెస్సేనని, ఆ పార్టీ నేతల మాయమాటలు ఎవరూ నమ్మొద్దని హితవు పలికారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. -
అవినీతి కానిస్టేబుల్స్‌పై వేటు
వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్లపై వేటు పడింది. పలు ఆరోపణలు రావడంతో కానిస్టేబుల్ సురేష్, హెడ్ కానిస్టేబుల్ భూపాల్‌రెడ్డిలను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇరువురికి మట్కా, క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నట్లు పలువురు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందాయని తెలిసింది. ఇటీవల పట్టణంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని సురేష్, భూపాల్‌రెడ్డిలు డబ్బు ఇవ్వాలని తరచూ బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై కూడా అప్పట్లో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. అంతేగాక ఓ మట్కా బీటర్‌తో సంబంధాలు పెట్టుకొని ఆర్థికంగా బాగా లబ్దిపొందినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడుల నేపథ్యంలో మట్కా బీటర్కు వీరు ముందస్తు సమాచారం ఇచ్చేవారని విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదులను కొద్దిరోజులుగా పరీశిలిస్తున్న జిల్లా ఎస్పీ.. సురేష్, భూపాల్‌రెడ్డిలను వీఆర్‌కు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరువురు వెంటనే వీఆర్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఎస్పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని పోలీసు అధికారులు తెలిపారు. కాగా విచారణ అనంతరం రెండు లేదా మూడు రోజుల్లో తదుపరి చర్యలు కూడా ఉంటాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. వన్‌టౌన్ పీఎస్‌లో ఒకేసారి ఇద్దరిపై వేటు పడటంతో సిబ్బంది వెన్నులో వణుకుపుడుతోంది. -
ఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాలుడే..
- ఉప ఎన్నికకు అభ్యర్థి ప్రకటన - భూపాల్‌రెడ్డి పేరు ఖరారు - కార్యకర్తల భేటీలో మంత్రి హరీశ్‌రావు ప్రకటన సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘కారు’ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేసుకొని జోరు మీదున్న టీఆర్ఎస్.. వచ్చే నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.భూపాల్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కల్హేల్ మండలం సత్యపూర్ చౌరస్తా వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడతూ.. భూపాల్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. పార్టీకి విశ్వాసపాత్రుడు వచ్చే నెల (కొత్త సంవత్సరం) మొదటి, రెండో వారాల్లో శాసనసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని రాజకీయ పార్టీల అంచనా. ఈ మేరకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో నారాయణఖేడ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి 14746 ఓట్ల తేడాతో దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై ఓటమి పాలయ్యారు. కిష్టారెడ్డికి 62,347 ఓట్లు రాగా, భూపాల్‌రెడ్డికి 47,601 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం భూపాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ టికెట్ టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి పలువురు పోటీపడ్డారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న భూపాల్‌రెడ్డిపైనే మంత్రి హరీశ్‌రావు విశ్వాసం ప్రకటించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా భూపాల్‌రెడ్డికే మరోసారి అవకాశమివ్వాలని హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. పేరు: మహారెడ్డి భూపాల్‌రెడ్డి పుట్టిన తేదీ: 7.5.1960 స్వగ్రామం: ఖానాపూర్ (కె)- (కల్హేర్ మండలం) విద్యార్హతలు: బీఎస్సీ, హైదరాబాద్ ఏ.వీ కళాశాల (ప్రాథమిక స్థాయి నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం) తల్లిదండ్రులు: స్వర్గీయ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే- ఎం.శకుంతల, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ భార్య, సంతానం: భార్య జయశ్రీరెడ్డి, కుమారుడు రోషన్ మహారెడ్డి, కుమార్తె శ్రేయారెడ్డి నిర్వహించిన పదవులు.. 1990 నుంచి కల్హేర్ మండలం కృష్ణాపూర్ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా రెండుసార్లు ఎన్నిక. డీసీసీబీ డెరైక్టర్‌గా, డీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు టీడీపీ కల్హేర్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు 2008లో టీడీపీ నుండి టీఆర్ఎస్లో చేరి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ఈయన సివిల్ కాంట్రాక్టర్