తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ | TDP Leaders Conflicts In Navanirmana Deeksha At PSR Nellore | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ

Published Sat, Jun 9 2018 12:17 PM | Last Updated on Sat, Oct 20 2018 4:47 PM

TDP Leaders Conflicts In Navanirmana Deeksha At PSR Nellore - Sakshi

ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఆనం రామనారాయణరెడ్డి, కన్నబాబు వర్గీయుల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆనం వర్గీయులపై కన్నబాబు వర్గీయులు దాడి చేశారు. మున్సిపల్‌ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్‌ బొగ్గవరపు శ్రీకాంత్‌ నారాయణ గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి కన్నబాబు వర్గంగా  కొనసాగుతున్నాడు. మారిన పరిణామాల క్రమంలో ఆనం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా నియమితులు కావడంతో శ్రీకాంత్‌ ఆనం వర్గంలోకి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కన్నబాబుకు అత్యంత సన్నిహితులైన కొందరు శ్రీకాంత్‌తో పాటు ఆనం వర్గానికి చెందిన కొందరిని స్థానిక సినిమా హాల్‌ వద్దకు రమ్మని ఫోన్‌ చేసి పిలిపించారు. అక్కడ ఇరువర్గాలు పాత విషయాలను దృష్టిలో ఉంచుకుని వాదులాడుకున్నారు. మాటామాటా పెరిగి ఇరువర్గాలకు బాహాబాహీకి దిగారు. స్థానికులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి సినిమా హాల్‌ నుంచి వెలుపలికి పంపించారు. దీంతో కౌన్సిలర్‌ శ్రీకాంత్‌ నారాయణ పోలీస్‌స్టేషన్‌లో తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం బందోబస్తుకు వెళ్లి ఉండటంతో ఏఎస్సై ఫిర్యాదును స్వీకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement