
సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగలనుంది. గతకొంత కాలంగా టీడపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు ఎన్నికల వేళ పార్టీ మారతారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, విద్యారంగంలో సంస్కరణలు తెచ్చే పార్టీకే తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు రెండు రోజుల్లో ప్రజాభిప్రాయం తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల అనంతరం కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తానని, ప్రజా ఉద్యంమంలోకి వెళ్తానని తెలిపారు. టీడీపీలో తనకు చాలా అవమానాలు జరిగాయని వాపోయారు. పొన్నలూరు నుంచి టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా చైర్మన్ పోటీలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు.
(టార్గెట్ ఈదర!)
Comments
Please login to add a commentAdd a comment