
మంత్రి పితాని సత్యనారాణ (ఫైల్ ఫొటో)
సాక్షి, ఆచంట/పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీలో ముసలం పుట్టింది. ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ ఎంపీపీ సురేఖ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. మంత్రి పితాని సత్యనారాణ వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా గురువారం అవిశ్వాసం పెడుతున్నారనీ, మంత్రి వేధింపులు తట్టుకోలేకనే రాజీనామా చేసినట్టు ఆమె మీడియాకు వెల్లడించారు. మంత్రిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎంపీ సీతారామ లక్ష్మికి ఫిర్యాదు చేశానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment