అమ్మో! ఆ భవనాలు రాహుల్‌ గాంధీవా!!? | These Buildings Owned By Rahul Gandhi | Sakshi
Sakshi News home page

అమ్మో! ఆ భవనాలు రాహుల్‌ గాంధీవా!!?

Published Tue, Apr 30 2019 6:50 PM | Last Updated on Tue, Apr 30 2019 6:59 PM

These Buildings Owned By Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :‘రాజీవ్‌ గాంధీ కుమారుడు పప్పూకు చెందిన భవనాలివి. అతి ఖరీదైన విలాసవంతమైన ఈ భవనాలను భారత దేశాన్ని యావత్తు దోచుకొని కొన్నాడు పప్పూ. నేను ఇప్పుడు ఇటలీలో ఉన్నాను. ఇగో ఇవి రాజీవ్, సోనియా గాంధీలకు చెందిన భవనాలు. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఇండియాలో కూర్చొని పప్పూ డబ్బులు దండుకుంటున్నాడు. ఇక పప్పూ పని అయిపోయిట్లే. ఆయన్ని భారత్‌ నుంచి తరిమేయాల్సిందే. జై శ్రీకష్ణ, నేను ఇటలీలో ఉన్నా ’ అంటూ మధ్య వయస్కుడైన  ఓ గుజరాతీ గుజరాతీ భాషలో మాట్లాడిన ఈ వీడియోను ‘మేరా భారత్‌ మహాన్‌’ అనే ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే రెండు లక్షల మందికిపైగా వీక్షించగా, 20 వేల మంది వరకు షేర్‌ చేసుకున్నారు.



ఆర్‌బీఐ డైరెక్టర్‌ ఎస్‌. గురుమూర్తి ఈ వీడియోను రీట్వీట్‌ చేయడం గమనార్హం. ఇది ఫేక్‌ న్యూస్‌ అని సులభంగానే గ్రహించ వచ్చు. ఈ భవనాలను పప్పూ కొన్నడని ఓ చోట, రాజీవ్‌ గాంధీ, సోనియా గాంధీ భవనాలని మరో చోట మాట్లాడారు. అంతేకాకుండా భవనాలు శిఖరం వరకు పూర్తిగా కనిపించేలా వీడియో తీయలేదు. పూర్తిగా చూపిస్తే ఎక్కువ గుర్తు పడతారేమోనన్న భయం కావచ్చు! అవి సాధారణ భవనాలయితే గుర్తు పట్టకపోవచ్చునేమోగానీ అవి ఇటలీలో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతానికి చెందినవి. వీడియోలో చూపించిన భవనాలు ఇటలీ టూరిన్‌ నగరంలోని ‘పిజ్జా క్యాస్టెల్లో’ సెంటర్‌కు చెందినవి. ఇందులో రాయల్‌ ప్యాలెస్‌తోపాటు మూడు ప్రాచీన చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటిల్లో మ్యూజియంలు, సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. వీటిని ఎవరు, ఎవరికి అమ్మడానికి, కొనడానికి వీల్లేదు. ఎందుకంటే, యునెస్కో చారిత్రక కట్టడాల సంరక్షణ జాబితాలో ఈ భవనాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు మరో మూడు విడతల పోలింగ్‌ ఉండడంతో రాహుల్‌ గాంధీని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో ఈ ఫేక్‌ న్యూస్‌ను సర్కులేట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement