
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని బలమైన, తిరుగులేని రాజకీయశక్తిగా మార్చే దిశగా ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు వ్యూహం అమలు చేయడం మొదలుపెట్టారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియతో దీన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. దీంట్లో భాగంగా సభ్యత్వ నమోదుతోపాటు గ్రామస్థాయి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్ని కలు జరుగుతాయి. రికార్డుస్థాయిలో సభ్యత్వ నమో దు చేసి టీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో తిరుగులేని రాజకీయశక్తిగా మార్చాలని కేటీఆర్ భావిస్తున్నారు. ఇన్నాళ్లు కొంత నిర్లక్ష్యానికి గురైన పార్టీ శ్రేణులు క్రియాశీలమయ్యేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి కాగానే టీఆర్‌ఎస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. ముందుగా సభ్యత్వ నమోదుతో ఇది ప్రారంభం కానుంది. దశలవారీగా గ్రామ, మండల కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా, నియోజకవర్గ కమిటీల్లో ఏది ఉండాలనే విషయంపై టీఆర్‌ఎస్ అధిష్టానం త్వరలోనే స్పష్టత ఇవ్వనుంది. ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ ఎన్నికతో సంస్థాగత ప్రక్రియ ముగుస్తుంది.
రికార్డుస్థాయిలో సభ్యత్వం...
ప్రభుత్వ వ్యవహారాల్లో అవసరమైన మేరకు పార్టీ సలహాలు ఉండేలా మార్పులు చేసే ఉద్దేశంతో ఉంది. దీని కోసం ముందుగా సభ్యత్వ నమోదును బాగా పెంచాలని భావిస్తోంది. 2017 సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి 75 లక్షల సభ్యత్వాల మేరకు పుస్తకాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గస్థాయి నేతలు తీసుకెళ్లారు. 70 లక్షలసభ్యుల పేర్లను నమోదు చేసినట్లు కేంద్ర కార్యాలయానికి పుస్తకా లను పంపించారు. కానీ, ఆ పుస్తకాల ప్రకారం పరిశీలిస్తే సభ్యుల సంఖ్య 43 లక్షలే ఉంది. 75 లక్షల సభ్యత్వాన్ని అధిగమించేలా ఈసారి సభ్యత్వ నమోదును నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే వీటిని పూర్తి చేసే యోచనలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఉంది.
జిల్లా కార్యాలయాలకు శంకుస్థాపన...
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణంపై దృష్టి సారించారు. వరంగల్, జనగామ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సంక్రాంతి తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ శంకుస్థాపనలు పూర్తి చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే అన్నిజిల్లాల్లో భవనాలు పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను ఆధునీకరించే పనులు మొదలయ్యాయి. సమాచార వ్యవస్థ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం కోసం టీఆర్‌ఎస్‌లో మొదటిసారి కొత్త రకమైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణభవన్‌లో ప్రత్యేంగా ప్రజాఫిర్యాదుల విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్‌సెల్)ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహా లు, సూచనలు ఇచ్చేలా పార్టీ వ్యవస్థను రూపొం దిస్తున్నారు. ప్రజలు ఎవరైనా సమస్యలపై పార్టీ వారి ని ఆశ్రయిస్తే వాటిని పరిష్కరించేలా అధికారిక వ్య వస్థకు, ఎమ్మెల్యేలకు నివేదించేలా ఈ వ్యవస్థ ఉండనుంది. పరిపాలన వ్యవహారాలపై అవగాహన ఉన్నవారిని ఈ విభాగంలో నియమించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment