![Vasireddy Padma condemns Jangalapalli incident - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/18/Vasireddy-Padma.jpg.webp?itok=0ykdj6t0)
సాక్షి, హైదరాబాద్ : కుప్పంలో టీడీపీ నేతలు దాష్టీకం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. శాంతిపురం మండలం గుంజార్లపల్లిలో ఓ మహిళను వివస్త్రను చేసి ఆ వీడియోను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పెట్టడం సిగ్గుచేటు అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని, కొద్ది రోజుల క్రితం విశాఖ జిల్లా పెందుర్తిలోనూ ఇటువంటి ఘటనే జరిగిందన్నారు.
ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. గుంజార్లపల్లి ఘటనపై డీజీపీ, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగి 24 గంటలు గడిచినా నిందితులను అరెస్ట్ చేయరా? అని ప్రశ్నించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment