సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సిట్టింగ్‌లపై సర్వేలపై సర్వేలు చేయించి, ఎప్పటికప్పుడూ చంద్రబాబు ర్యాంకులు ఇస్తూ ఏడాది కిత్రమే మొదలెట్టిన అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్లు మొదలైనా తేలడం లేదన్నారు. ప్రజల్లో 100 శాతం సంతృప్తి ఉంటే పరీక్షకు ముందు చదివే పిల్లాడిలాగా రేయింబవళ్లు కసరత్తులు దేనికని, ఘోర పరాజయం తప్పదని అశరీరవాణి ఘోషిస్తోందా? ఏంటని ప్రశ్నించారు.
తనకు 65 లక్షల పచ్చ సైన్యం ఉందని, కోటి మంది డ్వాక్రా మహిళలు, 55 లక్షల మంది పెన్షనర్లు, కోటి మంది లబ్దిదారుల ఓట్లు గంపగుత్తగా తమవేనని, తమ స్కోర్ 150 ప్లస్ అని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు.. మరోవైపు సీక్రెట్‌గా కిరాయి సేన సేవలను ఎందుకు హైర్ చేసుకుంటున్నట్లోనని ఎద్దేవా చేశారు. వారి అజ్ఞాత సేవల ప్యాకేజీకి ఎంత ఆఫర్ చేశారోనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment