సాక్షి, హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ సంస్థ మూతబడినప్పటి నుంచి చిట్టి నాయుడు (నారా లోకేశ్) మెదడులో అమర్చిన ‘చిప్’ కు సిగ్నల్స్ తీసుకోవడం లేదని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చిట్టినాయుడి చిప్‌కు సిగ్నల్స్ అందక ఎర్రర్ చూపిస్తోందని, అందుకే పెద్దనాయుడు వారం రోజులుగా చిట్టినాయుడుని ఆజ్ఞాతంలో ఉంచారని, డేటా దొంగ అశోక్ ఈ చిప్‌ను యాక్టివేట్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు.
కార్లు అమ్ముడు పోని కారణంగా కియా మోటార్స్.. చైనాలోని అతి పెద్ద ప్లాంటును మూసేసిందని, మరి అనంతపూర్లో ఏర్పటవుతున్న ప్లాంట్ సంగతేమిటోనని విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు. కమిషన్ల కక్కుర్తితో కియా మోటార్స్ కు చంద్రబాబు రూ. రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడనీ, ఈ కంపెనీ ఉద్యోగుల్లో స్థానికులు వంద మందికి మించి లేదని మండిపడ్డారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినందున.. ఇక అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. చంద్రబాబు, ఆయన తొత్తులకు భయపడాల్సిన అవసరం లేదని, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో మార్పుకోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ చారిత్రక ధర్మపోరాటంలో పోలీసు, సివిల్ అధికారులంతా న్యాయం వైపు నిలవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment