విశాఖపట్నం: టీడీపీ, బీజేపీ నుంచి పలువురు ముఖ్య నాయకులు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయి. వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వస్తారు. 2024నాటికి టీడీపీ ఖాళీ. ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుంది.పెద్ద నాయకులు మాతో టచ్‌లో వున్నారు. చర్చలు జరుగుతున్నాయి.పార్టీలో చేరిన వారికి పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తాం. గతంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని అభివృద్ధి వైసీపీతోనే సాధ్యం. అన్ని కులాలు, ఉప కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
లోకేష్ పదజాలం ఆదిమానవుల కంటే హీనం
‘‘లోకేష్ కొన్ని దశాబ్దాల క్రితం ఆదిమానవుల మాదిరిగా తయారయ్యాడు. లోకేష్ పదజాలం ఆదిమానవుల కంటే హీనం. సభ్యసమాజం భరించలేని రీతిన లోకేష్ మాటలు ఉన్నాయి. లోకేష్ అనాగరిక ప్రవర్తన చూస్తే అయనకు ఎవరో తప్పుడు సలహా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అసభ్యమైన భాషను ప్రజలు హర్షించరు. లోకేష్ పదజాలం చూస్తే రాజకీయాలకు అర్హుడా.. అమెరికా వెళ్లి ఎంబీఏ చదివాడా.. లేదంటే అవన్నీ బోగస్ డిగ్రీలా అనే అనుమానం కలుగుతుంది’’ అన్నారు విజయసాయి రెడ్డి.
(చదవండి: లోకేష్ రౌడీలాగా మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే రోజా)
‘‘రాష్ట్రలో జరుగుతున్న ఉపఎన్నికల్లో వైసీపీదే విజయం. కుప్పం, అనంతపురంలో టీడీపీ డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోంది. ఆ పార్టీకి జనం బుద్ధి చెబుతారు. ఉప ఎన్నికల్లో ఎక్కడ వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడ లేదు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలనే సాంప్రదాయాన్ని టీడీపీ తప్పింది. ఉప ఎన్నికల్లో టీడీపీ ద్వంద్వ ప్రమాణాల వల్లే చాలా చోట్ల పోటీకి కారణం అయ్యింది’’ అని విజయసాయి రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment