సాక్షి, అమరావతి: ప్రతిపక్షత నేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మై డియర్ పప్పూ అండ్ తుప్పూ ! భౌతిక దూరం పాటించడం అంటే... భౌతికంగా (రాష్ట్రానికి) దూరం కావటం కాదు.... ఇటలీలో ఉన్న పిల్లలు, గుజరాత్‌లో ఉన్న జాలర్లు, వేరే రాష్ట్రాల్లో ఉన్న కూలీలు కూడా వచ్చేశారు... పప్పూ అండ్ తుప్పూ మీరు మాత్రం టీకా వచ్చేవరకు ఇల్లు కదలం అంటున్నారు’అని పేర్కొన్నారు.
టెలిమెడిసిన్ సూపర్ హిట్
అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఇంకా తప్పటడుగుల దశలో ఉన్న టెలిమెడిసిన్‌ను సీఎం వైఎస్ జగన్ పల్లెబాట పట్టించారని విజయసాయిరెడ్డి ప్రశంసించారు. డాక్టర్ వైఎస్సార్ టెలిమెడిసిన్ పేరుతో మార్చిలో మొదలైన కార్యక్రమం సూపర్ హిట్ అయిందని చెప్పారు. దేశంలో కొన్ని వైద్య సంస్థలకే పరిమితమైన ఈ విధానాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో విస్తరింపజేశారని తెలిపారు. ఇక అత్యధిక టెస్టులు చేయడంలోనే కాదు.. వెంటిలేటర్లు, ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లు, ఐసీయూ బెడ్లు భారీ సంఖ్యలో నెలకొల్పిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అత్యవసర వైద్య బృందాలను ఎక్కడికైనా పంపించే సామర్థ్యం సాధించి రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపినందుకు అంతా యువ ముఖ్యమంత్రి వైపు చూస్తారని విజసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
(చదవండి: చంద్రబాబు రాజకీయ సన్యాసం : మంత్రి జోస్యం)
ఇదే మంచి అవకాశం!
ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్నవారు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వెసులుబాటు దొరికిందని విజయసాయిరెడ్డి అన్నారు. ‘ప్రవాసంలో ఉన్న తుప్పు, పప్పులకిది చక్కని అవకాశం. లాక్ డౌన్ సాకులు చెప్పే వీలు కూడా లేదు. వ్యాక్సిన్ వచ్చేదాకా అడుగుపెట్టేది లేదంటే శాశ్వతంగా అక్కడే ఉండి పోవాల్సి వస్తుంది. మీ ఇష్టం’అని చురకలంటించారు. మరో ట్వీట్‌లో.. ‘ఏడాది కానేలేదు. తనేంటో చూపించాడు యువ సీఎం. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ముందు 40 ఇయర్స్ ఇండస్ట్రీ వెలవెలబోతున్నది. ఎల్లో మీడియా ఎగరేసి ముద్దాడుతున్నా ఏం ప్రయోజనం. పరాజయం పాలై 11 నెలలు గడిచినా నేలకు దిగి రాలేక పోయాడు. కొన్ని జీవితాలంతే’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
(చదవండి: మనమే ముందున్నాం )
Comments
Please login to add a commentAdd a comment