సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ పర్యటనతో ఊపు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు ఊహల్లో ఉన్నారని అన్నారు. రాహుల్‌గాంధీ ఇక్కడే అడ్డా వేసినా..టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. రాహుల్‌గాంధీ సభావేదికపై ఉన్న నాయకులంతా ఎవరికి వారే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకులకు కామన్ ఎజెండా లేదని విమర్శించారు. ఒక నాయకుడు ఎన్నికలకు సిద్ధమంటే, మరొకరు ఇప్పుడే ఎందుకు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం, సఖ్యత లేదన్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి సమస్యలు, అంశాలు ఏమీ లేక సభ నుంచి కాంగ్రెస్ నేతలు పారిపోతున్నారని విమర్శించారు. ప్రాజెక్టులపై వందల కేసులు వేసి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ మీద విమర్శలు చేస్తున్న వారికి లోకజ్ఞానం లేదన్నారు. టీవీల్లో, పేపర్లలో కనిపించడానికే కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment