సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తున్నట్టుగా మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆదివారం చెప్పారు. ఈ నెల 26న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20 కేంద్రాల్లో ఓటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 27న సోమాజిగూడలో కౌంటింగ్ చేపడతామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. దీనిపై బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ప్రజా ఫలితం తర్వాతనైనా సీఎం ఆలోచనలో మార్పు రావాలని వీహెచ్ ఆకాంక్షించారు.