New Secretariat Design
-
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు)
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ లోపలి లుక్ చూసేయండి (ఫొటోలు) ] -
కొత్త సచివాలయానికి 8 నమూనాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయ భవనం కోసం అధికారులు ఎనిమిది నమూనాలతో కుస్తీ పడుతున్నారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా డిజైన్లు కావాలంటూ రోడ్లు భవనాలశాఖ ఇటీవలే దేశవ్యాప్తంగా పేరున్న 20 మంది ఆర్కిటెక్ట్‌లకు లేఖలు రాయడం తెలిసిందే. వారి నుంచి వచ్చిన నమూనాలను సచివాలయం, అసెంబ్లీ భవన నిర్మాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ పరిశీలిస్తోంది. గతంలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ స్వచ్ఛందంగా పంపిన నమూనా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకట్టుకుంది. గుమ్మటాలతో ఉన్న ఆ నమూనాకు దగ్గరగా ఉండే డిజైన్‌ను సిద్ధం చేయాలని అప్పట్లోనే ఆయన అధికారులను ఆదేశించారు. ఆ నమూనాను జతచేస్తూ ఆ తరహాలో నూతన సచివాలయ డిజైన్ ఉండాలని అధికారులు అర్కిటెక్ట్‌లకు లేఖలు పంపారు. గతంలో ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయానికి సంబంధించి మూడు నమూనాలు పంపారు. అందులో రెండు ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటే నిర్మించాలని భావించినప్పుడు వేసినవి కాగా, మరొకటి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కనున్న బైసన్ పోలో గ్రౌండ్లో నిర్మించాలని యోచించినప్పుడు వేసింది. ఈ మూడు కూడా బాగానే ఉన్నాయని ముఖ్యమంత్రి అప్పట్లో పేర్కొన్నారు. ఇప్పుడు వీటికి కొన్ని మార్పుచేర్పులు సూచిస్తూ ఆయన మరో డిజైన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నమూనాల్లో మెరుగ్గా ఉన్న కొన్నింటిని ఎంపిక చేసి టెక్నికల్ కమిటీ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. వాటిని మంత్రులు పరిశీలించి మళ్లీ మార్పుచేర్పులు అవసరమైతే చేసి ముఖ్యమంత్రికి అందివ్వనున్నారు. ఆయన చెప్పే సలహాల ఆధారంగా మార్పులు అవసరమనుకుంటే చేసి తుది నమూనా ప్రకారం టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత సచివాలయ భవనాల పటుత్వం ఎలా ఉందన్న అంశాన్ని టెక్నికల్ కమిటీ ఇటీవలే పరిశీలించింది. ఆ భవనాలు పరిశీలించిన నిట్ డైరక్టర్ వాటి పటుత్వంపై ‘అంచనా’వేశారు. అగ్నిప్రమాదాల సమయంలో ఆ భవనాలు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు పేర్కొనగా తాజా పరిశీలనలో అధికారులు గుర్తించిన వివరాలతో నివేదిక రూపొందించి మంత్రివర్గ ఉపసంఘానికి అందివ్వనున్నారు. -
అసెంబ్లీకో మంచి డిజైన్ కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీల కొత్త భవనాలకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. వాటిల్లోంచి ఒకదాన్ని ఎంపిక చేసి టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనాలు తెలంగాణ సంప్రదాయ వారసత్వ నమూనాను ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ భవనం నమూనాను పోలి ఉండేలా కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నట్టు ఇప్పటికే ఆయన ప్రకటించారు. సచివాలయ భవన ఆకృతి ఖరారు కావా ల్సి ఉంది. గుమ్మటాలతో ఉండే నమూనా వైపు సీఎం మొగ్గుచూపుతున్నారు. తమిళనాడుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ రూపొందించిన నమూనా బాగుందని ఆయన పేర్కొన్నారు. దానికి దగ్గరగా ఉండే మరో ఉన్నత నమూనాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనాల నిర్మాణంపై ఏర్పడ్డ అధికారుల కమిటీ ప్రముఖ ఆర్కిటెక్ట్‌లకు ఈ మేరకు లేఖలు రాసింది. మంచి నమూనా సిద్ధం చేయాల్సిందిగా ఆ లేఖల్లో పేర్కొంటూ 20 నిర్మాణ సంస్థలకు పంపింది. వాటిల్లో ఉత్తమమైన 3 డిజైన్లు ఎంపిక చేసి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదించనుంది. సీఎంతో సంప్రదించి అందులో ఓ నమూనాను ఉపసంఘం ఎంపిక చేయనుంది. హఫీజ్ కాంట్రాక్టర్ సహా.. ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సచివాలయం కోసం మూడు నమూనాలు రూపొందించారు. తొలుత ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రాంతంలోనే కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన ప్రభుత్వం ఆయనకు డిజైన్ల బాధ్యత అప్పగించింది. అప్పట్లో ఆయన 2 నమూనాలు రూపొందించారు. తర్వాత బైసన్ పోలో మైదానంలో నిర్మించాలనుకు న్నప్పుడు పెద్ద గుమ్మటంతో మరో నమూనా రూ పొందించారు. ఇప్పుడవి కాదని కొత్త నమూనాలు సిద్ధం చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో అధికారుల కమిటీ ఆయనకు కూడా లేఖ రాసింది. -
కొత్త సచివాలయ నిర్మాణంపై ఓటింగ్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తున్నట్టుగా మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆదివారం చెప్పారు. ఈ నెల 26న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20 కేంద్రాల్లో ఓటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 27న సోమాజిగూడలో కౌంటింగ్ చేపడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. దీనిపై బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ప్రజా ఫలితం తర్వాతనైనా సీఎం ఆలోచనలో మార్పు రావాలని వీహెచ్ ఆకాంక్షించారు. -
ప్చ్.. ‘తెలంగాణ’ కనిపిస్తలేదు!
కొత్త సచివాలయ డిజైన్లను తిరస్కరించిన సీఎం * యూరోపియన్, రోమన్ శైలిలో ఉన్నాయని పెదవి విరుపు * మళ్లీ నమూనాలు రూపొందించాల్సిందిగా ఆర్కిటెక్ట్‌కు సూచన * కొత్త అసెంబ్లీ, మండలికి స్థలాన్వేషణ * ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ ప్రాంగణంపై దృష్టి సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించబోయే సచివాలయం కోసం ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తిరస్కరించారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సచివాలయమైన సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్ భవన నమూనాల తరహాలో తెలంగాణ కొత్త సచివాలయం కోసం కొన్ని నెలల క్రితం ఆయన డిజైన్లు రూపొందించి స్వయంగా సీఎంకు అందజేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ నమూనాలు ఎక్కడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని భావించిన ముఖ్యమంత్రి తాజాగా వాటిని తిరస్కరిం చారు. వాటిని తెలంగాణ సంప్రదాయరీతులకు తగ్గట్టుగా మార్చి కొత్త నమూనాలు రూపొందించాలని, వాస్తుపరంగా కూడా మరికొన్ని మార్పులు చేయాలని సూచించారు. దీంతో ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ కొత్త నమూనాల రూపకల్పనలో ఉన్నారు. కొత్త సచివాలయానికి ‘గుమ్మటం’ డిజైన్ సాధారణంగా సీఎం కేసీఆర్ గుమ్మటాలతో కూడిన నిర్మాణాలను ఇష్టపడతారు. అవి దక్కన్ నిర్మాణ శైలికి దగ్గరగా ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, ఇటీవల తెలంగాణ సచివాలయానికి కొత్తగా నిర్మించిన ప్రధాన ద్వారం సెక్యూరిటీ కార్యాలయ భవనం నమూనాలు దీనికి నిదర్శనం. కొత్త సచివాలయ భవనం ప్రధాన బ్లాకుకు కూడా గుమ్మటం డిజైన్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇక సచివాలయంలో సీఎం బ్లాక్ అన్నింటికంటే ఎత్తుగా ఉండటంతోపాటు, అందులో ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం నైరుతి దిశలో ఉండేలా చూడాలని ఆయన సూచించారు. రెండు బ్లాకులు పెంచటం గాని లేదా సీఎం బ్లాకు 11 అంతస్తులతో నార్త్, 9 అంతస్తులతో సౌత్ బ్లాకులు ఉండేలా చూడాలని ఆయన సూచించినట్టు సమాచారం. విభాగాధిపతులు సహా 55 విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. మొత్తం విభాగాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, అవసరమైన వైశాల్యం... తదితర వివరాలను ఇటీవలే రోడ్లు భవనాల శాఖ అధికారులు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అందజేశారు. నాలుగు రోజుల క్రితం ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులు ఆర్అండ్బీ అధికారులతో సమావేశమయ్యారు. అంతకు నెల ముందు హఫీజ్ కూడా వచ్చి అధికారులతో మాట్లాడి వెళ్లారు. అసెంబ్లీ, మండలికి స్థలాల వేట ఉన్నచోటనే కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు వేరేచోట స్థలం వెదకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం జీఏడీ ఆధ్వర్యంలో కొన్ని స్థలాలను కూడా పరిశీలించారు. ఎర్రమంజిల్‌లో నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పాత కార్యాలయ భవనాలున్న ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవలే ఆర్‌అండ్‌బీకి కొత్త భవనం అందుబాటులోకి రావటంతో పాత హెరిటేజ్ భవనం ఖాళీగా ఉంది. పాత భవనాలను తొలగిస్తే దాదాపు పదెకరాల స్థలం అందుబాటులోకి వస్తుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకాలం తర్వాత.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని నగర శివారు ప్రాంతానికి తరలించి అక్కడ కొత్త సచివాలయంతోపాటు అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించాలని భావించారు. కానీ దానిపై తీవ్ర విమర్శలు రావటంతోపాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ప్రస్తుతం సచివాలయం ఉన్న చోటనే పాత భవనాలు తొలగించి నిర్మించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి నాలుగైదు నెలల క్రితమే హఫీజ్ కాంట్రాక్టర్ నమూనాలు రూపొందించి సీఎంకు అందజేశారు. ఆ నమూనాలను సీఎం కార్యాలయం కూడా బహిర్గతం చేసింది. త్వరలో ఏపీ సచివాలయం ఖాళీ అవుతున్నందున దసరా సందర్భంగా కొత్త సచివాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన నమూనాల ప్రకారమే పనులు మొదలవుతాయని భావిస్తున్న తరుణంలో సీఎం వాటిని తిరస్కరించటం గమనార్హం. ఆ నమూనాలు యూరోపియన్, రోమన్ శైలిని ప్రతిబింబిస్తున్నాయని సీఎం భావిస్తున్నారు.