
మహబూబ్‌నగర్ : కేసీఆర్ ప్రభుత్వ అక్రమాల పై తాము అధికారంలోకి వచ్చాక విచారణ చేయిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై జడ్బర్లలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, రైతుకు నీళ్లు ఇచ్చింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనన్నారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లేవు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లు రావన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పై జనం గర్జిస్తున్నారని, ప్రజల ఆశలను కేసీఆర్ నీరుగార్చారని మండిపడ్డారు.
ప్రభుత్వం మహిళలు, యువత, రైతుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రశ్నిస్తే పోలీసులు లాఠీలకు పనిచెబుతున్నారని ,బేడీలు వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఆదివాసులపై అక్రమ కేసులు పెట్టి, వారి భూములను లాక్కుంటుందని తెలిపారు. రాహుల్ రాకతో దేశంలో కొత్త శకం ప్రారంభ మైందని.. గుజరాత్ ఫలితాలే దీనికి నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment