
ఉప్పులూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న యర్రా నవీన్
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా) : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ యర్రా నారాయణస్వామి కుటుంబం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడానికి మొగ్గుచూపారు. యర్రా తనయుడు కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా నవీన్ గురువారం ఉండి నియోజకవర్గం ఉప్పులూరులో యర్రా అభిమానులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. యర్రా కుటుంబానికి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో యర్రా నారాయణస్వామి, నవీన్ పార్టీ మారనున్నారనే ప్రచారం గత కొన్నిరోజులుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో అభిమానులతో నిర్వహించిన సమావేశంలో పార్టీకి ఎంతో సేవచేసిన నారాయణస్వామికి టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడంలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. గుర్తింపు లేని పార్టీలో కొనసాగే కంటే పార్టీని వీడడమే మేలని అభిమానులు చెప్పడంతో నవీన్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుందామని ప్రకటించినట్లు తెలిసింది. సమావేశంలో పాతపాటి సర్రాజు, మంతెన యోగీంద్రకుమార్(బాబు), రెడ్డిపల్లి సత్యనారాయణ, పీవీ గోపాలకృష్ణంరాజు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment