
బెంగళూర్ : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ మెజారిటీ కోల్పోయిందని, ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బీజేపీ శాసనసభాపక్ష భేటీకి ముందు ఆయన మాట్లాడుతూ తమ ఎమ్మెల్యేలతో మాట్లాడిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుపై తమ పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సంఖ్యాబలం లేకపోయినా ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలోనే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆయన సంకేతాలు పంపారు. సంకీర్ణ సర్కార్ మెజారిటీ కోల్పోయినందున ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరుతూ తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనని యడ్యూరప్ప చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు సంకీర్ణ ప్రభుత్వానికి లేదని అన్నారు. మరోవైపు ముంబై హోటల్‌లో బసచేసిన కాంగ్రెస్, జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు గోవాకు తమ మకాం మార్చారు.
Comments
Please login to add a commentAdd a comment