
సాక్షి, తాడేపల్లి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుకు సమాయత్తమైంది. ఈ సందర్బంగా ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కేజ్రీవాల్ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్ పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని ఆమె విమర్శించారు. అభివృద్దే ఢిల్లీలో ఆప్‌ను గెలిపించిందని ఆమె పేర్కొన్నారు. అలాగే ఆప్ విజయంపై హర్షం వ్యక్తం చేసిన ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్.. ‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.(హస్తిన తీర్పు : లైవ్ అప్‌డేట్స్)
Comments
Please login to add a commentAdd a comment