
సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నరకం చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థుల ఇబ్బందులపై శనివారం ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘డీఎస్సీ అభ్యర్థులకు చంద్రబాబు నరకం చూపిస్తున్నారు.
22 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే వాయిదాల మీద వాయిదాలు వేసి వాటిని 7 వేలకు సరిపెట్టారు. పోస్టుల కుదింపు పేరుతో సిలబస్ మార్పులతో పరీక్షా సమయంపై గందరగోళం సృష్టిస్తూ అభ్యర్థులను మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. టీచర్‌గా ఎంపిక కావాలంటే కోచింగ్‌లకే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం రాగానే మొదటి ఏడాదే డీఎస్సీ నిర్వహిస్తాం’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment