సాక్షి, బనగానపల్లె: ’ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరుతెరిస్తే.. 2022, 2029, 2050 అంటున్నారు. ఇప్పటికే ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇక, 2050 వచ్చేసరికి ఆయన వయస్సు ఎంత ఉంటుందో నాకైతే తెలియదు. 2029నాటికే చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తాయ్. ఇవాళ ఏం చేస్తున్నవో చెప్పవయ్యా పెద్దమనిషి అంటే చెప్పకుండా.. 2020, 2050 అంటూ ఉదరగొడుతున్నారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం బనగానపల్లె చేరుకున్నారు. బనగానపల్లెలో వైఎస్ జగన్‌కు పెద్దసంఖ్యలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. అశేషమైన ప్రజావాహినితో బనగానపల్లె కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. 2022నాటికి రాష్ట్రాన్ని నంబర్‌వన్ చేస్తా.. 2029నాటికి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ చేస్తా.. 2050నాటికి ఇంకా ఏమైనా ఉంటే.. అన్నిట్లో నంబర్‌వన్ చేస్తానని చంద్రబాబు ఊదరగొడుతున్నారని తెలిపారు. ‘మీ గ్రామ సర్పంచ్ ఎవరైనా 2022కు వ్యాటర్ ట్యాంకు కట్టిస్తాను.. 2029నాటికి రోడ్డు వేస్తాను.. 2050 నాటికి అమెరికా మాదిరిగా చేస్తానంటే.. మీరు ఏమంటారు? మెంటల్ కేసు అని అనరా?’ అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని చాలా విషయాల్లో నంబర్ వన్ చేశారు..
- ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని చాలా విషయాల్లో నంబర్ వన్ చేశారు
- రైతులను అప్పులపాలు చేయడంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పులపాలు చేయడంలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారు
- రాష్ట్రాన్ని అవినీతిలో, అబద్ధాలు ఆడటంలో, మద్యం అమ్మకాల్లో.. ఇలా చాలా విషయాల్లో నంబర్‌వన్ చేశారు
- పిల్లల ఫీజులను ఎగ్గొట్టడంలోనూ, పెంచడంలోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారు
- దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచి..
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను అనారోగ్య ఆంధ్రప్రదేశ్ చేయడంలో నంబర్ వన్ చేశారు - పేదవాళ్లు ఆరోగ్య శ్రీ పథకం కింద హైదరాబాద్ వెళ్లి వైద్యం చేయించుకోకూడదట.
- చంద్రబాబు, ఆయన కొడుకు మాత్రం ప్రభుత్వ సొమ్ముతో విదేశాల్లో వైద్యం చేయించుకుంటారంట.
- పేదోడు హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకుంటే అంత కష్టమా చంద్రబాబూ..
నా పాదయాత్ర సమరశంఖారావం
- చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై సమరశంఖం పూరిస్తూ నేను పాదయాత్ర చేపట్టాను.
- ఇవాళ మనస్సాక్షిగా గుండెల మీద చేయివేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది
- మనకు ఎలాంటి పరిపాలన కావాలి అన్నది పరిశీలించుకోవాలి
- ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి, కాబట్టి ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనకుగానీ, మన ఇంటికిగానీ, మన ఊరికిగానీ, మన రాష్ట్రానికిగానీ ఏదైనా మంచి జరిగిందా?.. బాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదు
- టీడీపీ పాలన వచ్చి నాలుగేళ్లైనా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి
- ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దాన్నైనా చంద్రబాబు నెరవేర్చాడా?
- రైతుల రుణమాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నాడు
- బ్యాంకుల్లో బంగారం ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలన్నాడు
- రైతుల రుణాలు మాఫీ అయ్యాయా? బ్యాంకుల్లోని బంగారం ఇంటికి వచ్చిందా? రాలేదు
- పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యాయా? కాలేదు
- జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఒకవేళ జాబు ఇవ్వలేకపోతే.. నెలకు రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశాడు
- ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాల్సిందే
- ఇదే ముఖ్యమంత్రి ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు.. ఒక్క ఇల్లైనా బాబు కట్టించాడా?
- ఇవాళ రేషన్ షాపుకు వెళ్లితే బియ్యం తప్ప ఏమైనా ఇస్తున్నారా?
- నాలుగేళ్ల కిందట కరెంటు బిల్లు ఎంత వస్తుంది.. ఇవాళ ఎంత వస్తుంది
- ఇదే చంద్రబాబు ఏమన్నాడు కరెంటు బిల్లు ఒక్క రూపాయి పెంచనని చెప్పాడు
- ఏ కులాన్ని, మతాన్ని చంద్రబాబు విడిచిపెట్టలేదు
- బోయలను, రజకులను ఎస్సీలుగా చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు
- కాపులను బీసీల్లో కలుపుతానని మాట ఇచ్చి తప్పాడు
- బనగానపల్లె నియోజకవర్గంలో శనగపంట అధికంగా పండుతుంది. కానీ శనగలకు గిట్టుబాటు ధర ఉందా? లేదు
- నాలుగువేల రూపాయలకు కొనేవాడు లేడు. గిట్టుబాటు ధరలేక రైతులు ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారు
- శనగ, మినుము, పత్తి, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు
- బనగానపల్లె మామిడిపండుకు ఫేమస్. మామిడికి కూడా గిట్టుబాటు ధరలేదు
- మూడు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉంది
మోసం చేసిన చంద్రబాబు..
- నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు
- అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు
- చెప్పినవన్నీ చేసే పరిస్థితి రావాలి... లేకుంటే రాజీనామా చేయాలి
- విలువలు, విశ్వసనీయత పెరగాలి
మీరు చేయాల్సిందల్లా...
- ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు అందరూ కలిసి రావాలి
- అందరి బాగు కోసం ఇప్పటికే నవరత్నాలు ప్రకటించాం
- అక్కా చెల్లెమ్మలకు అండగా ఉండేందుకు అమ్మ ఒడిని అమలు చేస్తాం
- మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపడమే
- పిల్లలను బడికి పంపితే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తాం
- పేద విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు కావాలి...
- అప్పుడే ఆ కుటుంబాలు బాగుపడతాయి..
- ఉన్నత చదువులు చదివే పిల్లలకు పూర్తి డబ్బులు నేనే ఇస్తా
- ఖర్చుల కోసం ఏటా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తా
మేనిఫేస్టోలో ప్రతి అక్షరాన్ని అమలు చేస్తాం...
- అవ్వా తాతలకు పెన్షన్ రూ.2 వేలు చేస్తా
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పెన్షన్ వయస్సును 45 ఏళ్లకు తగ్గిస్తా
- కులాలు, మతాలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తా
- కులాలు, మతాలకు అతీతంగా నిరుపేదలందరికీ ఇళ్లు కట్టిస్తా
- రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి..
- అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తా
- ముందుగానే ధరలు ప్రకటించి పంటలు కొనుగోలు చేస్తాం
- రైతులను ఆదుకునేందుకు ఖరీఫ్ ప్రారంభానికి ముందు ..
- మే నెలలో రూ. 12,500 చొప్పున నాలుగేళ్లు చెల్లిస్తాం
- మన మేనిఫెస్టో చంద్రబాబులా ఉండదు..
- మీరిచ్చే సలహాలతో రెండు, మూడు పేజీల్లో మేనిఫేస్టో తెస్తాం
- అందులోని ప్రతి అక్షరాన్ని అమలు చేస్తాం
ఇటువంటి పాలన పోవాలి..
- చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు, మోసం
- ఇటువంటి సీఎం మనకు కావాలా?
- పెన్షన్ రావడం లేదని ప్రతి అవ్వా, తాత అడుగుతున్నారు
- పిల్లలు నా దగ్గరకు వచ్చి జాబు రావాలంటే బాబు పోవాలి అంటున్నారు.
- సున్నా వడ్డీ ఎగిరిపోయింది, పావలా వడ్డీ కార్యక్రమం పోయింది.
- ఇటువంటి పాలన పోవాలి.. ఎటువంటి రాజకీయ పరిస్థితులు రావాలంటే..
- రాజకీయ నేత చెప్పింది చేయలేకుంటే రాజీనామా చేసే పరిస్థితి రావాలి
- ఇటువంటి రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత రావాలి.. విలువలు రావాలి
- చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి
- మార్పు తీసుకొచ్చే రాజకీయ వ్యవస్థలోకి మీ ముద్దు బిడ్డను ఆశీర్వదించండి
ఉన్నత చదువులు చదివే పిల్లలకు పూర్తి డబ్బులు నేనే ఇస్తా
Comments
Please login to add a commentAdd a comment