
సాక్షి, గుంటూరు : టీడీపీ వచ్చే ఎన్నికల్లో దోచుకున్న డబ్బుతోనే గెలవాలని చూస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్ధసారథి విమర్శలు గుప్పించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని కమిటీల కన్నా బూత్ కమిటీలదే ప్రధాన్యత అన్నారు. ఎక్కవ బూత్ స్థాయిలో సమస్యలను కనుగొని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
‘కొన్ని పత్రికల చేత కావాలనే వైఎస్సార్‌సీపీపై దుష్పచారం చేస్తున్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. ఈ ప్రభుత్వంలో పేదవాడికి న్యాయం జరగలేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలకు పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. ఉపాధి హామీ పథకం నిధులు లబ్ధిదారులకు చేరకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడో మర్చిపోయారు. ఆడ పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే అరికట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. చంద్రబాబుకి యంత్రాంగంపై పట్టు లేదు’ అని కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment