
సాక్షి, హైదరాబాద్ : తన స్వార్థం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందాలు చేసుకున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఫార్ములా పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని అన్నారు. కొత్త డీల్ వివరాలను ముఖ్యమంత్రి తప్పకుండా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలంతా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు మాత్రం బలహీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నాలుగేళ్లుగా బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలని అన్నారు. ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. తెలంగాణతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చెప్పుకుంటూ అప్పులు, హత్యలు, నేరాలతో చివరకు అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేశారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment