సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కల్యాణ్ తీరు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉందన్నారు. నిజ జీవితంలో ఆయన పోషిస్తోన్న పాత్ర ఫ్లాప్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘ఒక సినిమాలో హీరోగా, మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.
మరో ట్విట్‌లో దిశ ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తన కుటుంబ సభ్యులైతే ఒకలా.. పరాయి ఆడపిల్ల అయితే మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘రేప్ చేస్తే ఉరి తీస్తారా? రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని ‘తీర్పు’ చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్నారు. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండడం దురదృష్టకరం’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment