సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం హజీస్‌పురంలో పొగాకు రైతులు కలిశారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేదని, క్వాలిటీ లేదంటూ కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని జగన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు.
మరోవైపు అక్షయ గోల్డ్ బాధితులు కూడా వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక 87 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని అక్షయ గోల్డ్ బాధితులు వాపోయారు. ఇక గుడి భూములు, పేదల భూములను కబ్జాలు చేస్తున్న టీడీపీ నేతలు చివరకు.. జాలర్లను కూడా వదలడం లేదు. చేపలు పట్టుకునే మోపాడు రిజర్వాయర్ను ఆక్రమించుకుని జాలర్ల పొట్టగొడుతున్నారు. మత్స్యకారులు ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. 95వ రోజు పాదయాత్ర రామపురం, గుదేవారిపాలెం క్రాస్ మీదగా, హజీస్‌పురం వరకూ కొనసాగింది. ఇప్పటివరకూ ఆయన 1,275.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Comments
Please login to add a commentAdd a comment