Tobacco farmer
-
‘వర్జీనియా’ రైతుకు ‘పొగ’
సాక్షి, అమరావతి: వర్జీనియా పొగాకు సాగుదార్ల ఆశలపై టుబాకో బోర్డు నీళ్లు చల్లింది. ఒక్కో బ్యారన్ పరిధిలో విక్రయ పరిమాణానికి నామమాత్రపు పెంపు మాత్రమే ఇచ్చింది. ఈ నిర్ణయం పట ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పది క్వింటాళ్ల పెంపును ఊహిస్తే మూడో వంతు కూడా బోర్డు ప్రకటించలేదని పెదవి విరుస్తున్నారు. ఒక్కో బ్యారన్ కింద 2.5 నుంచి 3.5 క్వింటాళ్ల విక్రయ పెంపును మాత్రమే టుబాకో బోర్డు అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దక్షిణప్రాంత తేలికపాటి భూములు (ఎస్ఎల్ఎస్), దక్షిణాది నల్లరేగడి భూముల్లో (ఎస్బీఎస్) వర్జీనియా పొగాకు రైతులు 2021–22 సంవత్సరానికి ఒక్కో బ్యారన్ కింద కనీసం 40 క్వింటాళ్ల వరకైనా పొగాకును విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తారని ఆశించారు. అయితే ఇటీవల సమావేశమైన టుబాకో బోర్డు అధికారులు ఒక్కో బ్యారన్ కింద ఎస్ఎల్ఎస్ రైతులకైతే 33.5 క్వింటాళ్లు, ఎస్బీఎస్ రైతులకైతే 32.5 క్వింటాళ్ల విక్రయానికి మాత్రమే అనుమతించాలని తీర్మానించారు. ఉత్పత్తి లక్ష్యం 130 మిలియన్ కిలోలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 130 మిలియన్ కిలోల పొ గాకు ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఎస్ఎల్ఎస్ ప్రాంత రైతుల కోటా 43.68 మిలియన్ కిలోలు. ఎస్బీఎస్ ప్రాంత రై తుల కోటా 37.44 మిలియన్ కిలోలుగా అధికారులు నిర్ణయించారు. సాగు వ్యయం నానాటికీ పెరుగుతున్న పరిస్థితుల్లో మరింత పొగాకు విక్రయానికి బోర్డు అనుమతివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్ఐ) ఒక్కో పొగాకు బ్యారన్ కింద కనీసం 55 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతించాలని టుబాకో బోర్డుకు ప్రతిపాదించింది. వర్షాధారిత ప్రాంతాల్లో రైతులు ఒక్కో పొగాకు బ్యారన్ కింద ఏడు ఎకరాలు సాగు చేస్తుంటారు. పరిస్థితులు బాగుండి దిగుబడి బాగా వస్తే రైతులు మరో బ్యారన్‌ను తీసుకోవడమో లేక అదనపు ఉత్పత్తికి జరిమానా కట్టడమో చేయాలి. ప్రతి ఏటా కనీసం పది శాతం సాగు వ్యయం పెరుగుతున్నది. ఆ స్థాయిలో రేటు పెరగడం లేదు. పంట విక్రయ విషయంలో బోర్డు నిర్ణయం రైతులకు శరాఘాతమని టుబాకో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు భద్రారెడ్డి వ్యాఖ్యానించారు. -
మూడేళ్లయినా ఎక్స్‌గ్రేషియాకు దిక్కులేదు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలంలోని అయ్యపురాజుపాలెం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అప్పుల బాధ తాళలేక గంగవరపు హరిబాబు (30) 2015 జూలై 12న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవరపు నర్సింగరావు ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడు హరిబాబు కుటుంబ భారాన్ని తనపై వేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఉన్న నాలుగు ఎకరాలు భూమితోపాటూ మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని, 10 ఎకరాల్లో పొగాకు, రెండెకరాలలో కంది సాగు చేశాడు. రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. పొగాకుకు రూ. లక్ష రుణం పొందాడు, బంగారం తాకట్టు పెట్టి రూ.45 అప్పు తెచ్చాడు. మరో రూ. 4 లక్షలు నెలకు వందకు రూ. రెండు వడ్డీకి ప్రైవేటుగా అప్పుతెచ్చాడు. పరిస్ధితి అనుకూలించకపోవటంతో 25 క్వింటాళ్ల పొగాకు మాత్రమే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర రాక చివరికి రూ. మూడున్నర లక్షల అప్పు మిగిలింది. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లకు తట్టుకోలేక మనస్తాపం చెందిన హరిబాబు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హరిబాబు కుటుంబానికి ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఎక్స్‌గ్రేషియా అందలేదు. రుణ మాఫీ కాలేదు.. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు 20 సార్లు తిరిగాం. సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాం. మాకు న్యాయం జరగలేదు. అధికారులు పట్టించుకోలేదు. రూ.120తో పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం ఉంటే సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. దీని వల్లా ఎలాంటి ఉపయోగం లేదని తేలిపోయింది. ఉపయోగం లేనçప్పుడు పార్టీ ఎందుకు? సభ్యత్వం ఎందుకు? – కిరణ్, మృతుని సోదరుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు పొగాకు పచ్చాకు ముఠాకు కూలి డబ్బుల బకాయిలను వడ్డీకి తెచ్చి చెల్లించాం. తెచ్చిన డబ్బుకు వడ్డీ కట్టలేక ఇంకా అప్పులపాలయ్యాం. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం అందలేదు. – మృతుడి తండ్రి నర్శింగరావు -
వైఎస్ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు
సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం హజీస్‌పురంలో పొగాకు రైతులు కలిశారు. పొగాకుకు గిట్టుబాటు ధర లేదని, క్వాలిటీ లేదంటూ కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని జగన్ దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. మరోవైపు అక్షయ గోల్డ్ బాధితులు కూడా వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక 87 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని అక్షయ గోల్డ్ బాధితులు వాపోయారు. ఇక గుడి భూములు, పేదల భూములను కబ్జాలు చేస్తున్న టీడీపీ నేతలు చివరకు.. జాలర్లను కూడా వదలడం లేదు. చేపలు పట్టుకునే మోపాడు రిజర్వాయర్‌ను ఆక్రమించుకుని జాలర్ల పొట్టగొడుతున్నారు. మత్స్యకారులు ఇదే విషయాన్ని జగన్ దృష్టికి తెచ్చారు. 95వ రోజు పాదయాత్ర రామపురం, గుదేవారిపాలెం క్రాస్ మీదగా, హజీస్‌పురం వరకూ కొనసాగింది. ఇప్పటివరకూ ఆయన 1,275.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. -
పొగాకు రైతుకు ప్రత్యామ్నాయ ఉపాధి
డబ్ల్యూహెచ్ఓ సదస్సు తీర్మానం న్యూఢిల్లీ: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే హానీకి ఆ కంపెనీలనే బాధ్యులు చేసేలా చట్టాలు రూపొం దించాల్సిన తక్షణ అవసరం ఉందని ఢిల్లీలో జరిగిన డబ్ల్యూహెచ్‌వో పొగాకు నియంత్రణ సదస్సు తీర్మానించింది. ఆరు రోజులపాటు జరిగిన సదస్సుకు 180 దేశాల నుంచి సుమారు 15 వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నియంత్రించాలని కూడా తీర్మానంలో పేర్కొన్నారు. పొగాకు వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సు రైతులకు వ్యతిరేకంగా జరుగుతోందని పొగాకు కంపెనీలు ప్రచారం చేయడాన్ని ఓ ఉన్నతాధికారి తప్పుపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు కాకుండా పొగాకు పరిశ్రమకు వ్యతిరేకమని చెప్పారు. 2018లో జెనీవా లో జరిగే తదుపరి కాప్ పొగాకు నియంత్రణ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది. -
పొగాకు రైతు ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బండపురంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సొంటి లక్ష్మణస్వామి(50) పొగాకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఉన్న రెండున్నర ఎకరాల భూమిలోంచి పోలవరం కాలువ వెళ్లడంతో.. రెండెకరాల భూమి నష్టపోయాడు. దీంతో వ్యవసాయానికి దూరమై అప్పులు తీర్చే దారికనపడక మనోవేదనకు గురయ్యాడు. భూమికి చెందిన డబ్బు రావడంతో బ్యాంకులో ఉన్న రుణాన్ని తీర్చేశాడు. కాని బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన రూ. 5 లక్షల అప్పు తీర్చే దారి కనపడక పోవడంతో..బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
గుండెపోటుతో పొగాకు రైతు మృతి
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా జీలుగుపల్లి మండలం ములగలంపల్లిలో ఓ పొగాకు రైతు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాలు.. ములగలంపల్లికి చెందిన రైతు సోమగాని రాంబాబు పొగాకు పండించేవాడు. అయితే, పంటకు సరైన గిట్టుబాటు ధరలేకపోవడం, అప్పులు ఎక్కువైన కారణంగా మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందాడు. మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, మండలానికి చెందిన నాయకులు పరామర్శించారు. -
పొగాకు రైతు ఆత్మహత్య
పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామానికి చెందిన ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రి వెంకటేశ్వరరావు (50) మంగళవారం ఉదయం పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. పొగాకు విక్రయించినా అప్పులు తీరలేదన్న మస్తాపంతో అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. -
పొగాకు రైతు ఆత్మహత్య
టంగుటూరు (ప్రకాశం) : పొగాకుకు గిట్టుబాటు ధర లేక, అప్పుల భారం పెరిగి తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరు పంచాయతీ పొదలవారిపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. పొందూరుకు చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు (40)కు మూడు ఎకరాల భూమితో పాటు, ఒక పొగాకు బ్యారన్ ఉంది. తన మూడు ఎకరాలతో పాటు 17 ఎకరాల పొలం, రెండు బ్యారన్లు కౌలుకు తీసుకుంటున్నాడు. గత మూడేళ్లుగా ఇదే పద్ధతిలో రెండు బ్యారన్ల పొగాకు సాగు చేస్తున్నాడు. పొగాకు దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తున్నాడు. ఏటా నష్టాలు పెరిగి అప్పుల భారం మోయలేని స్థితికి చేరింది. బ్యాంకు రుణం రూ.10 లక్షలు కాగా..వడ్డీ వ్యాపారుల దగ్గర మరో రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాదీ బ్యారన్‌కు రూ.3 లక్షలు నష్టం తప్పేలా లేదు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై ఆరు నెలలు దాటినా ఇప్పటికీ తన పొగాకు దిగుబడిలో కేవలం 60 శాతమే అమ్ముకోగలిగాడు. ఇంకా 40 శాతం పొగాకు నిల్వలు ఇంట్లోనే మూలుగుతున్నాయి. ఈ ఏడాదైనా అప్పులు తీర్చలగనన్న నమ్మకం పోయింది. అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఏం చేయలో దిక్కుతోచక కృష్ణారావు తీవ్ర ఆందోళన చెందాడు. ఇంతకాలం గుట్టుగా ఉన్న పరువు బజారున పడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఆలోచనలతోనే చివరకు తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి నేరుగా బాత్రూంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. బాత్రూంకు వెళ్లిన భర్త బయటకు రాకపోవడంతో భార్య శారద వెళ్లి చూడగా బాత్రూంలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కృష్ణారావును స్థానికుల సాయంతో బయటకు తెచ్చారు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా..అప్పటికే అతను మృతిచెందాడు. కృష్ణారావుకు భార్యతో పాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా ఆత్మహత్య చేసుకున్న కృష్ణారావు కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని పొగాకు బోర్డు (ఆర్ఎం ) కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. మృతదేహంతో కార్యాలయ ఆవరణలోనే నిరసనకు దిగారు. కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఆర్ఎం హామీతో ఆందోళన విరమించారు. -
మనస్తాపంతో పొగాకు రైతు మృతి
టంగుటూరు (ప్రకాశం): పండించిన పొగాకు ధరలు పడిపోవటంతో తీవ్ర ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన దళిత రైతు మిడసల కొండలరావు (55) పదెకరాల్లో పొగాకు వేశారు. బుధవారం ఉదయం టంగుటూరులోని వేలం కేంద్రానికి పొగాకు తీసుకుని వేలం పాటకు హాజరయ్యాడు. అయితే, గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించకపోవటంతో కొండలరావు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో అక్కడే కుప్పకూలి చనిపోయాడు. -
ఆగిన పేదరైతు గుండె
-
ప్రత్యామ్నాయం చూపాలి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే పొగాకు నిషేధంపై ఆలోచించాలని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌ను కోరారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయన కేంద్ర మంత్రిని కలిశారు. పొగాకు ఉత్పత్తులపై కేంద్రం తీసుకురానున్న బిల్లుపై వారు మంత్రితో చర్చించారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలు కూడా గమనంలోకి తీసుకోవాలని కోరారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు ఎక్కువగా పండుతుందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగలు, తదితర పంటలను ముందుకు తీసుకువచ్చినా వాటి వల్ల రైతాంగం నష్టపోయిన సంగతి గుర్తు చేశారు. పొగాకు వాడకం వల్ల కేన్సర్ వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి హర్షవర్ధన్ ప్రస్తావించారు.దీనిపై ఎంపీతో పాటు రైతుల ప్రతినిధి బృందం స్పందిస్తూ దీనికి తాము ఏకీభవిస్తామని, అదేసమయంలో లక్షలాది మంది రైతుల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. పొగాకుకు ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా చర్యలు తీసుకుంటేనే రైతులను ఆ పంటలు వేసుకునే విధంగా ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో దీని గురించి ఆలోచించాలని కోరారు. ప్రతినిధి బృందంలో పొగాకు రైతు ప్రతినిధులు పీవీ సత్యనారాయణ రెడ్డి, ఆర్ నరేంద్ర, గద్దె శేషగిరిరావు, వెంకటరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు ఉన్నారు.