డబ్ల్యూహెచ్‌ఓ సదస్సు తీర్మానం
న్యూఢిల్లీ: పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని, పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే హానీకి ఆ కంపెనీలనే బాధ్యులు చేసేలా చట్టాలు రూపొం దించాల్సిన తక్షణ అవసరం ఉందని ఢిల్లీలో జరిగిన డబ్ల్యూహెచ్‌వో పొగాకు నియంత్రణ సదస్సు తీర్మానించింది. ఆరు రోజులపాటు జరిగిన సదస్సుకు 180 దేశాల నుంచి సుమారు 15 వందల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నియంత్రించాలని కూడా తీర్మానంలో పేర్కొన్నారు. పొగాకు వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలపై ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సదస్సు రైతులకు వ్యతిరేకంగా జరుగుతోందని పొగాకు కంపెనీలు ప్రచారం చేయడాన్ని ఓ ఉన్నతాధికారి తప్పుపట్టారు. ఇలాంటి కార్యక్రమాలు రైతులకు కాకుండా పొగాకు పరిశ్రమకు వ్యతిరేకమని చెప్పారు. 2018లో జెనీవా లో జరిగే తదుపరి కాప్ పొగాకు నియంత్రణ సదస్సుకు భారత్ నేతృత్వం వహిస్తుంది.