అప్పుల బాధ తాళలేక పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం బండపురంలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సొంటి లక్ష్మణస్వామి(50) పొగాకు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో అతనికి ఉన్న రెండున్నర ఎకరాల భూమిలోంచి పోలవరం కాలువ వెళ్లడంతో.. రెండెకరాల భూమి నష్టపోయాడు. దీంతో వ్యవసాయానికి దూరమై అప్పులు తీర్చే దారికనపడక మనోవేదనకు గురయ్యాడు. భూమికి చెందిన డబ్బు రావడంతో బ్యాంకులో ఉన్న రుణాన్ని తీర్చేశాడు.
కాని బయట ప్రైవేటు వ్యక్తుల దగ్గర తెచ్చిన రూ. 5 లక్షల అప్పు తీర్చే దారి కనపడక పోవడంతో..బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.