
చెన్నై:నగరంలోని చెపాక్ స‍్టేడియంలో చెన్నై సూపర్‌కింగ్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌ను భారీ భద్రత నడుమ నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ను అడ్డుకుంటామని ఆందోళన కారుల హెచ్చరికల నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మైదానం బయట 144 సెక్షన్‌ను తలపించేలా చెన్నై పోలీస్ విభాగం గస్తీ నిర్వహిస్తోంది.
ఇదిలాఉంచితే, క్రికెట్ అభిమానులు కూడా మ్యాచ్‌ను చూడటానికి పెద్దగా ఆసక్తికనబరచలేనట్లే కనబడుతోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లకు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, చెపాక్ స్టేడియంలో కళ తగ్గింది. దాదాపు 12 వేల సీట్లు ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా మ్యాచ్ జరగదనే అనుమానంతోనే చాలా మంది టికెట్లు కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపలేదు. దాంతో స్టేడియంలో పూర్తి స్థాయి జోష్ లేదనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment