విజయనగరం: ఆంధ్ర, ముంబై జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం, వెలుతురు లేమితో అంతరాయం కలిగింది. శుక్రవారం కేవలం 26 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 170/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర రెండో ఆట ముగిసే సరికి 4 వికెట్లకు 213 పరుగులు చేసింది. సెంచరీ పూర్తి చేసుకున్న రికీ భుయ్ (103)తో పాటు ప్రదీప్ (0) వెనుదిరగ్గా...కెప్టెన్ కైఫ్ (311 బంతుల్లో 89 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్), అశ్విన్ (8 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
హైదరాబాద్ 325/9 డిక్లేర్డ్: మరో వైపు గోవాలో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 325 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో రోజు మెహదీ హసన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ రాణించలేదు. అనంతరం గోవా వికెట్ కోల్పోయి 47 పరుగులు చేసింది.
26 ఓవర్ల ఆట మాత్రమే...
Published Sat, Oct 3 2015 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement